ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలి
05-08-2026 01:28 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాల లు, గ్రంథాలయం, హాస్టల్, ఆసుపత్రి వసతులు, ఇతర మౌలిక సదుపాయాలను పరి శీలించి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జి ల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కీలకమ ని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో ఆర్&బీ, వైద్య ఆరో గ్య శాఖ అధికారులు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.






