5 August, 2026 | 2:20 AM

కర్వేనా పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి

05-08-2026 01:28 AM

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి శాంతికుమార్

భూత్పూర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కరివేన రిజర్వాయర్ పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి శాంతి కుమార్ అన్నారు. మంగళవారం బిజెపి రాష్ట్ర నాయకులు ఎగ్గని నర్సింలు ఆధ్వర్యంలో పాలమూరు బిజెపి నాయకులతో కలిసి పాలమూరు... రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన కరువేనా రిజర్వాయర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బండారి శాంతి కుమార్ మాట్లాడుతూ పెండింగ్ పనులను వేగవంతం చేసి పాలమూరు రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొన్నారు. పాలమూరు ప్రజలు తేదీల మీద తేదీలు విని విసిగిపోయారని, కావాల్సింది కొత్త ప్రకటనలు కాదు... రైతు పొలానికి కృష్ణమ్మ నీళ్లు, కరివెన రిజర్వాయర్ నిండితేనే ప్రాజెక్టు లక్ష్యం నెరవేరినట్టు కాదు, ఆ నీళ్లు కాల్వల ద్వారా చివరి ఆయకట్టు రైతు పొలానికి చేరినప్పుడే అసలైన లక్ష్యం నెరవేరుతుందన్నారు.

ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, పునరావాసం, పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పర్యటనలో బీజేపీ రాష్ట్ర నాయకులు పడకుల బాలరాజు, అచ్చుగట్ల అంజయ్య, నంబి రాజు, రవీందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నిరంజన్, నాగరాజు, శేఖర్ రెడ్డి, రవీందర్, నిరంజన్, కప్పేట సత్తన్న, ఆంజనేయులు, సుధీర్, పిల్లి సూర్యనారాయణ, అవినాష్, సదానంద్, బుచ్చిబాబు తదితర బీజేపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.