గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి
మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
మేడ్చల్, మే 2 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే ఏం లాభంలేదని, బీజేపీని గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని కౌకూర్‌లో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరిలో బైక్ మెకానిక్ అసోసియేషన్, ఫీర్జాదిగూడలో కురుమ సంఘం సభ్యులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, అలా అయితేనే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని అంటున్నారని గుర్తుచేశారు.
40 మంది ఎంపీలు మాత్రమే కాంగ్రెస్‌కు ఉన్నారని, 350 పైచిలుకున్న బీజేపీ ఎంపీలను ఓడించి అధికారం దక్కించుకోవడం సాధ్యమా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే లోక్‌సభలో కొట్లాడుతారని కేసీఆర్ చెప్తున్నారని, కానీ ఆయనే సీఎం కాలేదని, ఇక ఎంపీలు ఏవిధంగా గెలుస్తారో చెప్పాలని నిలదీశారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.




