15 April, 2026 | 4:37 AM

ప్రొఫెసర్ల తొలగింపు

27-02-2026 12:00 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ గైర్హాజరు అవుతున్న ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అయేషా పర్వీన్, డాక్టర్ జి స్రవంతి, డాక్టర్ ఆర్ లక్ష్మణ్, డాక్టర్ పి లీలావతి,

డాక్టర్ ఎం అపూర్వలను వైద్య విద్య డైరెక్టరేట్ విధుల నుంచి తొలగించింది. సర్విస్ నుంచి తొలగిస్తూ డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ వేటు వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో షోకాజు నోటీసులిచ్చినా వారు స్పందించలేదు.