17 June, 2026 | 12:18 PM

Breaking News

అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •  

కార్మికులు ఎవరు అధైర్య పడొద్దు

03-02-2025 12:00 AM
  • మీ కుటుంబ అండగా నేనున్నా 

ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ 

మంంథని, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): సింగరేణి కార్మికులు ఎవరు అధైర్య పడొద్దు. మీ కుటుంబాలకు అండగా నేను న్నా అని  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు.  కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్ జి-1 జిఎం లలిత్ కుమార్‌కు  ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచిం చారు.

రామగుండం జీడీకే ఓసి-5 లో గత రెండు రోజుల క్రితం క్యాంటీన్ విషయమై తలెత్తిన సమస్యపై ఎమ్మెల్యే  కు మరియు సిఎండికి ఫిర్యాదు చేసిన లెటర్‌లో స్థానిక కార్మికులు సంతకాలు చేసినందుకు అధికా రులు కార్మికులకు నోటీసులు జారీ చేశారు.

మీరు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్  ఫిర్యాదు చేస్తారా... అంటూ నాయకులను, పలువురు కార్మికులపై చర్యలు తీసుకుంటామని గని మేనేజ్మెంట్ బెదిరింపులకు పాల్పడుతుం దని ఆదివారం ఐఎన్టియుసి నాయకులు జనగామ శ్రీనివాస్ గౌడ్, మరియు అరగంటి కష్ణ,  ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను కలిసి వినతి పత్రం ఇస్తూ వారి సమస్యని తెలియ జేశారు.

హైదరాబాద్ లో వారు  ఎమ్మెల్యే దష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన  ఆర్జీ-1 జిఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిం చాలని సూచించారు. కార్మికుల ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని కార్మికులకు ఇచ్చిన నోటీసులు వెంటనే రద్దు చేయాలని గని మేనేజ్మెంట్‌ను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్  నాయకులు ఉన్నారు.