13-09-2025 03:43:15 AM
- బీఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి
మంచిర్యాల, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటు న్న సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు (బిఎంఎస్) శ్రీ రాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ‘సింగరేణి పరిశ్రమ పరిరక్షణ - కార్మిక హక్కుల హక్కుల సాధన’ కోసం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు నిర్వహించిన మహా ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు పరిశ్రమల్లో సింగరేణి సమస్యలను పరిష్కారం కొరకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, యాజమాన్యాలు, పరిశ్రమల ప్రగతి, నూతన బొగ్గు బావుల ఏర్పాటు, కార్మికుల సంక్షేమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ నాయకులు అందుగుల శ్రీనివాస్, బీఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, మందమరి ఏరియా సెక్రెటరీ గుర్రం ప్రదీప్ కుమార్, ట్రెజరర్ గూడ శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీ కట్కూరి సతీష్, బోడకుంట శ్రీధర్, టి కిరణ్ కుమార్, నీరటి సురేష్, కొమ్ము బాబు, బుర్ర అరుణ్ గౌడ్, కుంట రాజు, ప్రశాంత్ తదితరులున్నారు.