13-09-2025 03:45:04 AM
రూ. 62.7 లక్షల విలువ చేసే 627 గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ మహాజన్
అదిలాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాం తి): జిల్లాలో గంజాయి సాగు, అమ్మకాలు, ఉపయోగం పై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కు పాదం మోపుతోంది. జిల్లా ఎస్పీ అఖి ల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తం గా పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ గంజాయి దందాపై నిఘా పెంచారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయగా, తాజాగా గుడిహత్నూర్ మండలంలో పెద్ద ఎత్తున గంజాయి సాగుపై దాడులు నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, ఇతర పోలీసులతో కలిసి ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
గుడిహత్నూర్ మండలం తోషం గ్రా మ శివారులో మర్సుకోల దేవరావు, అతని కుమారులు జగన్, మర్సుకోల నగేష్‌లు తమ పంట పొలంలో పత్తి పంట మాటున గంజాయిని సాగు చేస్తున్నారన్నారు. గంజాయి మొక్కలను పండిస్తున్నార నే పక్కా సమాచారంతో సీసీఎస్, ఇచ్చోడ సర్కిల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. తండ్రి దేవరావుని అరెస్టు చేయగా ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుండి రూ. 62.7 లక్షల విలువ చేసే 627 గంజాయి మొక్కలు స్వాధీనం చేకున్నామన్నారు. ఈ సమావేశంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.