13-09-2025 03:43:04 AM
ముషీరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ టి యు జెఏసి ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం,
ప్రొఫెసర్ గాలి వినోద్ కుమా ర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గద్దర్ కుమారులు సూర్యం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఓయూ జేఏసీ నాయకులు మాందాల భాస్కర్, టివియూవి అధ్యక్షులు కంచర్ల భద్రి, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆజాద్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అధ్యక్షులు గోధుమలు కుమార స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ సాధనలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన హక్కులను సాధించుకునే దిశగా ఉద్యమకారులు మరో ఉద్యమం చేస్తున్నారని అన్నా రు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకాల సమస్యలు పరిష్కరించాల్సి ఉండేదని, ఆ ప్రభు త్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యమకారులు రోడ్డున పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రం సిద్ధించిందని, ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు దక్కాలని తెలిపారు. అమర వీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని, ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఉదుమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 250 గజాల స్థలం ఇచ్చి వారికి అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టి యు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, తెలంగాణ ప్రాం తీయ ఉద్యమ సమితి వ్యవస్థపక అధ్యక్షులు గుండా యాదగిరి, పాండు, టియు జెఏసి వైస్ చైర్మన్ భోగే పద్మ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు కోతి మాధవి, డోలాక్ యాదగిరి, బాబన్న, కే. రాజేంద్ర ప్రసాద్, మోత్కూర్ మల్లేశం, జి యాదగిరి, గుండమల్ల శ్రీను,గాజుల యాదగిరి, పొట్లకాయల వెంకటేశ్వర్ రావు, లలిత, అశోక్ రాబర్తి, చిలుక శారదా తదితరులు పాల్గొన్నారు.