14-01-2026 12:00:00 AM
పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ డిమాండ్
అలంపూర్, జనవరి 13: గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్ల శివారులోని నది బయోటెక్ కంపెనీ గేట్ ముందు 100 మందికి పైగా కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు.గత 13 నెలల పెండింగ్ జీతాలను చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. కంపెనీ యాజ మాన్యం మారి ఆరు నెలలు గడుస్తున్నా... పాత కార్మికులకు నేటికీ జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఆగ్రహిం చిన కార్మికులు కంపెనీ గేటు ముందు ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమా న్యం స్పందించి పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ప్రతిరోజు ధర్నా కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. అయితే గతంలో కూడా ఇలాంటి ధర్నా సంఘటనలు పునరావృతమైన కంపెనీ యాజమాన్యం మాత్రం స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.