2 May, 2026 | 2:28 AM

కార్మికులు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి

02-05-2026 01:17 AM

జూనియర్ సివిల్ జడ్జి సందీప్

బోథ్, మే 1 (విజయ క్రాంతి) :  కార్మికులు వారికున్న హక్కులను చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జూనియర్ సివిల్ జడ్జి కే. సందీప్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవా న్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై అవగాహన కలిగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు శ్రమ దోపిడీ కావద్దని పనిగంటలు ఎనిమిదిగా తెలుసుకోవాలన్నారు లేబర్ ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలని ఆరోగ్య భద్రత విషయంలో రాసి పడకుండా భద్రత తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసగా వద్దని వాటికి బానిసైతే కుటుంబాలు వీధిన పడతాయి అన్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ ఏజిపి పందరం శంకర్ న్యాయవాదులు కుమ్మరి విజయకుమార్ ధర్మపాల్ యువ అంజయ్య వార్డు సభ్యులు కట్ట భూమేష్ సాయి సోయం అంబాజీ బీగల్ సర్వీసెస్ స్రవంతి సంగీత కార్మికుల పాల్గొన్నారు.