26-12-2025 12:03:34 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి డిసెంబర్ 25 (విజయక్రాంతి) కొత్తకొండ గ్రామ అభివృద్ధికి నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామ కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసము లో బుధవారం ఉదయం కొత్తకొండ గ్రామ మాజీ సర్పంచ్ కంకల సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకు లు పూదరి రవీందర్ గౌడ్ ,
మాజీ ఉప సర్పంచ్ కొత్తకొండ సిద్ధమల్ల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు అయిత సుదర్శన్ నలుగురు మంత్రిగారిని హైదరాబాద్ లో గల సొంత నివాసము లో ఉదయం 6 గంటలకు కలిసి ప్రత్యేక సమావేశము లో సొంత పనులను గ్రామ అభివృద్ధి సమస్యలపై మంత్రి తో కూలంకుషంగా మాట్లాడడం జరిగినది. కొత్తకొండ అభివృద్ధికి సహకరిస్తానని మాట ఇవ్వడం జరిగినది. మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.