calender_icon.png 26 December, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్‌బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

26-12-2025 12:02:19 AM

కాటారం, డిసెంబర్ 25 (విజయక్రాంతి): కాటారం మండల కేంద్రం లోని అంబేద్కర్ కూడలి వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. దామెరకుంట మానేరు వాగు పై 203 కోట్లు, కాటారం రోడ్డు నుండి సబ్ స్టేషన్ పల్లి వయా దుబ్బగూడెం రోడ్డు నిర్మాణంకై 3 కోట్లు , సుబ్బయ్యపల్లి నుండి ప్రతాపగిరి వరకు 3.50 కోట్ల నిధులు మంజూరు చేపించినందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్ర పటానికి కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.

అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కాటారం మం డలాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు కి కాటారం మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో కాటారం మండలాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.