calender_icon.png 3 December, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిత సెంటర్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

03-12-2025 05:59:45 PM

చిట్యాల (విజయక్రాంతి): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత సెంటర్ చిట్యాల నందు మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ అధ్యక్షతన బుధవారం ర్యాలీ, సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యంగులను సమాజంలో చిన్నచూపుతో చూస్తారని, కాని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారు సమాజంలో అందరితో సమానంగా ఉన్నత స్థాయిలో ఎదిగే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వారిపట్ల ఆప్యాయత, అనురాగం చూపిస్తూ వారి భవిష్యత్ నిర్మాణానికి, గొప్ప వ్యక్తులుగా ఎదిగే విధంగా అందరు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా చిట్యాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి పిల్లలకు సేవ చేసిస్తునటువంటి తల్లిదండ్రులు భగవంతుడికి సేవ చేసినట్లుగా భావించాలని, ఇలాంటి విద్యార్థుల పట్ల ఈ మండలంలో నేను ఉన్నంతవరకు నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జ్ ఎమ్మార్వో విజయ, ఆర్ఐ షరీఫ్, ఎంపీఓ కోటేష్, చిట్యాల ఉన్నంత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి సత్తయ్య, ఉపాధ్యాయినిలు సౌమ్య, చైతన్య, ఎంఆర్సి సిబంధి వరలక్ష్మి, సరిత, జాన్, ప్రవళిక, జయకాంత్ పాల్గున్నారు. ఈ  కార్యక్రమం అనంతరం ఆటలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.