5 June, 2026 | 1:51 PM

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

05-06-2026 12:45 PM

సుల్తానాబాద్ జడ్జి దుర్గం గణేశ్ 

సుల్తానాబాద్ , జూన్ 05 (విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్  మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో న్యాయవాదులతో కలిసి జడ్జి గణేశ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి కి లభించిన విలువైన సంపద పర్యావరణం అని, దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.

ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, సహజ వనరుల సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలనిపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ ఆవుల శివకృష్ణ, ఎజిపి దూడంఆంజనేయులు, న్యాయవాదులు మాడూరి ఆంజనేయులు, పడాల శ్రీరాములు,   జోగుల రమేష్, పెగడ శ్యామ్ సుందర్, సామల రాజేంద్ర ప్రసాద్, గుడ్ల వెంకటేష్, మల్యాల కరుణాకర్, ఆకారపు రామకృష్ణ రెడ్డి, మాదూరి పృథ్వీ, గండి శ్రీనివాస్ , కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.