calender_icon.png 21 December, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు- లారీ ఢీ: ఒకరు మృతి

21-12-2025 11:10:11 AM

ఖమ్మం: తిరుమలాయపాలెం మండలం చంద్రతండా ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఖమ్మం నుండి వరంగల్ వెళ్తున్న ఒక లారీ మార్గ మధ్యలో పాడైపోవడంతో, డ్రైవర్ దానిని రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ఖమ్మం నుండి బోధన్ వెళ్తున్న టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ధాటికి లారీ కింద ఉన్న క్లీనర్ నితీష్ అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.