31-05-2025 08:48:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ధూమపాన నిషేధ దినోత్సవం(World No Tobacco Day) శనివారం జరుపుకున్నారు. సంఘ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ ట్యాంక్‌బండ్ వద్ద ధూమపాన నిషేధానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్దలు కావాలని కోరుతూ వైద్యులు ప్రతిజ్ఞ నిర్వహించారు. డాక్టర్ వెంకటరమణ ధూమపానం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నవిత సతీష్ ప్రశాంత్ శ్రీకాంత్ శ్రీనివాస్ వంశీ లు పాల్గొన్నారు