10 August, 2026 | 5:01 AM

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

10-08-2026 12:00 AM

ఆదివాసీ వస్త్రధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కలెక్టర్ కే. హరిత, ఎస్పీ నీతిక పంత్

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 9(విజయ క్రాంతి): ప్రపంచ ఆదివాసీ దినో త్సవాన్ని పురస్కరించుకుని  జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, కళలను ప్రతిబిం బించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్ర త్యేక ఆకర్షణగా నిలిచింది.ముందుగా జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం విగ్రహానికి ఎమ్మె ల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ కే. హరిత, ఎస్పీ నితికా పంత్,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, గిరిజన సంక్షేమ శాఖ డి ప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి  భీం ఆశయాలను స్మరించుకున్నారు. అక్కడి నుం చి ఆదివాసీ కళాకారులు, ప్రజలు, విద్యార్థులు, యువత భారీ ర్యాలీగా ఆదివాసీ భవ న్కు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో పలువురు వత్తులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, భాషలను పరిర క్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో ఆదివాసీ సమాజం మరింత అభివృద్ధి సాధించేలా ప్రభుత్వ సంక్షేమ పథ కాలను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, పాటలు విశే షంగా ఆకట్టుకున్నాయి.

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు సభికులను అలరించాయి. సంప్రదాయ దుస్తులు, వాయి ద్యాలు, నృత్యాలతో జిల్లా కేంద్రం పండుగ వాతావరణం సంతరించుకుంది. కలెక్టర్ కే. జిల్లా హరిత, ఎస్పి నితిక పంత్ లు ఆదివాసీ సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడం ప్ర త్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీ సం స్కృతి, సంప్రదాయాల పట్ల వారు చూపిన గౌరవం కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో మర్సకోలా సరస్వతి, పీఎంఆర్సీ ఏసీఎంవో పూర్కా ఉద్దవ్, జీసీడీవో కొట్నాక్ శకుంతల, ఏటీడీవో చిరంజీవి, శ్రీనివాస్, జిల్లా క్రీడల అధికారి మాడావి శేఖు, టీఎస్టీడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నైతం కృష్ణారావు, పూర్కా మాణిక్రావు, ఆదివాసీ నాయకులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.