02-02-2026 12:42:58 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 1: రాష్ట్రంలో తొలి సూర్య క్షేత్రమైన మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి మహా క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు.తెల్లవారుజామున ఉషా,పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు.మధ్యాహ్నం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు జరిపారు.అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమాన్ శ్రీ రామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్ స్వామి,నిర్వాహకులు గణపురం నరేష్,బాలమురళీకృష్ణ, రాజేష్, ఇంద్రారెడ్డి, జైపాల్ రెడ్డి,అర్చకులు పాల్గొన్నారు.