02-02-2026 12:41:30 AM
తాండూరు,ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు టిఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు, వీర శైవ యువ మాజీ దళ్ మాజీ అధ్యక్షులు ఇందూరు మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్ మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. రోహిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీరసేవ సమాజ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పైలట్ మాట్లాడు తూ పార్టీ ఒక మంచి ధైర్యవంతుడిని కోల్పోయిందని అన్నారు. ఆత్మహత్యకు దిగడం చాలా బాధాకరం అని అన్నారు. గత కొద్ది రోజులుగా పటేల్ ప్రవీణ్ తీవ్ర మానసిక వత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని 10 శాతం వడ్డీకి అప్పులు ఇచ్చిన వ్యక్తులు తమ డబ్బును రాబట్టుకునేందుకు పటేల్ ప్రవీణ్ పై వత్తిడి తేవడం తో మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
మరోవైపు గత కొద్ది రోజులుగా శ్రీ బావిగి భద్రేశ్వరస్వామి దుకాణ సముదాయం కోర్టు కేసుకు సంబంధించి రాజకీయ పరంగా కూడా పటేల్ ప్రవీణ్ పై వత్తిడి చేసినట్టు వెల్లడించారు. కోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలని రాజకీయ నేతలు వత్తిడి తీసుకువచ్చారని రోహిత్ రెడ్డి తెలిపారు.
యువకులు వత్తిడికి లోను కాకుండా ...బతికి సాధించుకోవాలని..క్షణికావేశం వద్దని రోహిత్ రెడ్డి సూచించారు. పటేల్ ప్రవీణ్ కుటుంబానికి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు సాయిపూర్ నర్సింలు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు