వాహ్.. పుచ్చకాయపై మోదీ చిత్రం!
రాజన్న సిరిసిల్ల, జూన్ 9 (విజయక్రాంతి): మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణసీకారం చేస్తున్న సందర్భంగా ఓ కారింగ్ కళాకారుడు పుచ్చకాయపై చేసిన కారింగ్ కళ ఆకట్టుకున్నది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కా రింగ్ కళాకారుడు, ఆర్టిస్ట్ శ్యామంతుల అనిల్ పుచ్చకాయపై నరేంద్ర మోదీని చెక్కి అందరినీ అబ్బురపరిచాడు.
అనిల్ 2019లో మోదీ ప్ర ధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడూ చిత్రాన్ని కారింగ్ చేశాడు. అయోధ్యలో రామ మందిరం నిర్మా ణం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగానూ రామ మందిరాన్ని, శివరాత్రి పండుగ సందర్భంగా శివుడిని, వినాయక చవితి సందర్భంగా మహాగణపతిని, క్రిస్మస్ వేడుక సం దర్భంగా శాంతా క్లాస్‌ను.. ఇలా అనే క చిత్రాలను పుచ్చకాయ, గుమ్మడికాయపై చిత్రాలను కారింగ్ చేశా డు. అతని కళా నైపుణ్యానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.






