13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వారెవా వారెవా..

06-01-2026 01:02 AM

అఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాను సోమవారం ‘వారెవా వారెవా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు అభిమానులు, మ్యూజిక్ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా..

శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ తమ వాయిస్‌తో పాటకు ఓ ఎమోషనల్ ఫీల్ తీసుకొచ్చారు. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ సంగీతం సారథ్యం వహిస్తోన్న  చిత్రంలోని ఈ పాట రొమాంటిక్ ఫీల్ కలిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకు 70 శాతం పూర్తయింది. మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేయటానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. సినిమాలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.