calender_icon.png 8 January, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో భోగి సందడి

06-01-2026 01:00:43 AM

స్టార్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘భోగి’. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా కొత్త షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో ప్రారంభమయ్యింది. ఈ కీలక షెడ్యూల్లో టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో శర్వా నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నారు.

అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1960ల ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్‌తో ’భోగి’ టెక్నికల్ గా నెకస్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ఈ చిత్రానికిస్టార్ కంపోజర్ భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిఓపి కిషోర్ కుమార్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.