22 March, 2026 | 12:01 PM

టీజీ సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన డాక్టర్ తోటచేను కృష్ణయ్య

22-03-2026 10:26 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ తోటచేను కృష్ణయ్య రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష అయిన టీజీ సెట్ లో ఇంగ్లీష్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో ఆయన ఈ విజయాన్ని సాధించారు. ప్రస్తుతం డాక్టర్ కృష్ణయ్య వనపర్తి లోని పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్‌లో ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కృష్ణయ్య సాధించిన విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరియు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.