15-10-2025 05:49:45 PM
నిర్మల్ రూరల్: నిర్మల్ మండలంలోని ఆశ్రమ గిరిజన బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ తెలిపారు. ఈనెల 18 నుంచి మహబూబ్నగర్ జిల్లాలో జరిగే పోటీలకు పాఠశాలకు చెందిన సికిందర్ కృష్ణ విజయ్ ముగ్గురు విద్యార్థులు ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు జిల్లా అధికారి అంబాజీనాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శైలజ అభినందించారు.