13 July, 2026 | 1:49 AM

భక్తజన సంద్రమైన యాదగిరిగుట్ట

13-07-2026 12:00 AM

ధర్మ దర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి రెండు గంటలు                                     

యాదగిరిగుట్ట, జూలై 12 (విజయక్రాంతి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగు ట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో వాహనా ల్లో, ఆర్టీసీ బస్సుల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. యాదగిరి కొండ పైన వేకువజా ము నుంచే యాదగిరి కొండ భక్తులతో కిటకిటలాడింది.

కొండ కింద రింగ్ రోడ్డులో వాహనాల రద్దీ పెరగడం కొండపైన వాహనాలతో నిండి స్థలం లేకపోవడంతో కొండ పైకి వాహనాలను అనుమతించలేదు.  ధర్మదర్శనానికి మూడు గంటలు స్పెషల్ దర్శనా నికి రెండు గంటల సమయం పట్టింది. ప్రసా ద విక్రయశాల యందు క్యూ లైన్ లలో భక్తు లు బారులు తీరారు. భక్తులు కొండ కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిం చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కొండపైకి నడిపించారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.