calender_icon.png 1 November, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అర్బన్ బ్యాంక్ పోలింగ్

01-11-2025 12:17:32 AM

- లెక్కింపు నేడే

- మూడు ప్యానల్‌లలో ఓట్రర్లు ఎటువైపో

- కీలకం కానున్న జగిత్యాల ఓటర్లు

కరీంనగర్,అక్టోబరు31 (విజయ క్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాం కు ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరగనుంది. పోలింగ్ అనంతరం సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.మూడు ప్యాన ల్ అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.. మూడు ప్యానళ్ల అభ్యర్థులు కాం గ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. కర్ర రాజశేఖర్ ప్యానల్ కు పార్టీ లకు అతీతంగా మద్దతు లభించడం, గడ్డం విలాస్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ ను నమ్ముకోవడం, మరో ప్యానల్ కు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు మద్దతిస్తుండడంతో ప్రచారం రసవత్తరంగా సాగింది.

కాంగ్రెస్ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు 12 డైరెక్టర్ స్థానాలకు 56 మంది పోటీ పడుతున్నారు. 43 మంది 9 జనరల్ స్థానాలకు, ఐదుగురు రెం డు మహిళా స్థానాలకు, ఒక ఎస్సీ, ఎస్టీ స్థా నానికి 8 మంది పోటీ పడుతున్నారు. వెలిచాల రాజేందర్ రావు ఏర్పాటు చేసిన ప్యా నల్ లో చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎ న్నికల తర్వాత మెజార్టీ సభ్యుల అభిప్రా యం మేరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటిం చేం దుకు నిర్ణయించారు. కర్ర రాజశేఖర్ ప్యా నల్లో డైరెక్టర్లుగా ఎ శ్రీనివాస్ రెడ్డి, తాటికొం డ భాస్కర్, టి వీరారెడ్డి, దేశ వేదం, బండ ప్రశాంత్ దీపక్, ఎండిషసియుద్దీన్, సాయికృష్ణ, సరిల్ల రతన్ రాజు, ముద్దసాని శ్వేత, వరాల జ్యోతిలు ఉన్నారు.

వెలిచాల రాజేందర్రావు నిర్మల భరోసా పేరుతో ప్యానల్ ను రూపొందించారు.,ప్యానల్ అభ్యర్థులు మూ ల వెంకట రవీందర్ రెడ్డి, ఇ లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉ య్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి,లున్నారు. గడ్డం విలాస్ రెడ్డి ప్యానల్ లో అక్కినపల్లి కాశీనా థం, ఎలగందుల మునీందర్, చింతల కిషన్, నాగుల సతీష్, రవీందర్, ఖలీల్డన్, లక్కిరెడ్డి కిరణ్ కుమార్, లింగంపల్లి శ్రీనివాస్, కంజర్ల రేణుకలు ఉన్నారు. కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు పార్టీలకతీతంగా వివిధ పార్టీల్లో ఉన్నవా రు ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ క్యాడర్ మూడు వర్గాలు విడిపోయి తమతమ వారి కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

రెండు చోట్లా పోలింగ్

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ లో ఓటర్లు 9287 ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 7272 జగిత్యాల జిల్లా లో 2015 మంది ఉన్నారు. అభ్యర్థుల గెలు పు ఓటమితో జగిత్యాల ఓటర్లు కీలకం కానున్నారు. కరీంనగర్ జిల్లాలో మహిళా డిగ్రీ , పీజీ కళాశాల కాశ్మీర్ గడ్డ లో పోలింగ్ స్టేషన్ లో 24 పోలింగ్ బూత్ లు జగిత్యాల జిల్లా లో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల లో 07 బూత్ లు ఏర్పాటు చేశారు  ఎన్నికలకు హైదరాబాద్ నుండి నందకిషోర్ జా యింట్ రిజిస్టర్ సహకార సంఘం రిజిస్టర్ నేడు కరీంనగర్ కు వస్తున్నాట్టు ఎన్నికల అ ధికారి మనోజ్ తెలిపారు. జిల్లా సహకార అధికారి పెద్దపల్లి శ్రీ మాల , జిల్లా సహకార అధికారి రాజన్న సిరిసిల్ల టి రామకృష్ణ లను పరిశీలకులుగా నియమించినట్లు తెలిపారు.