17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నాయకుడు

02-02-2026 12:00 AM

జక్కిడి సమక్షంలో హస్తం గూటికి చేరిన పోచబోయిన వినోద్ యాదవ్ 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 1 : మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ నాయకుడు పోచబోయిన వినోద్ కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం మన్సూరాబాద్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి సమక్షంలో వినోద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండ గా మన్సూరాబాద్ డివిజన్‌లో బీజేపీ నాయకుడు పోచబోయిన వినోద్ యాదవ్ ఆయ న అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం మన్సూరాబాద్ చౌరస్తా నుంచి కామినేని చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పోచబోయిన రవి యాదవ్, శంకర్ యాదవ్, వెంకు ల యాదవ్, కృష్ణ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట శ్రావణ్, నాయకులు రఘుపతి, గిరి, రాజశేఖర్ రెడ్డి, జక్కిడి సత్య తేజారెడ్డి, అఖిల్ రెడ్డి, రాంబాబు రెడ్డి, తురుపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.