calender_icon.png 11 December, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవ పంచాయతీల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం టాప్

08-12-2025 12:00:00 AM

పల్లెల్లో ఏకగ్రీవం అయ్యేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి, డిసెంబర్ 7(విజయ క్రాంతి):  పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు.. పల్లెలు అభివృద్ధి సాధిస్తే.. దేశం అభివృద్ధి సాధిస్తుంది& దేశ ఆర్థిక వ్యవస్థకు గ్రామాలే పునాది లాంటివి. ప్రస్తుతం ఈ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు.. తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని, తమకు ఒకసారి అవకాశం కల్పించాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

కాగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే ఏకగ్రీవాల నిధులను సధ్వినియోగం చేసుకోవాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కోసం సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇచ్చిన పిలుపు మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకోవడం ఇప్పుడు కామారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో చర్చకు తెరలేపింది.

జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ముందంజలో & కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు వార్డ్ మెంబర్ స్థానాలకు ఏకగ్రీవమైనటు అధికారులు ధ్రువీకరించారు. కాగా మొదటి రెండు విడతల్లో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు..

ఎల్లారెడ్డి మండలంలో 

1. తిమ్మారెడ్డి తండా, 2. హాజీపూర్ తండా, 3. అజామాబాద్, 4. సామర్యగడి తండా, 5 తిమ్మారెడ్డి

గాంధారి మండలం..

1. హేమ్లానాయక్ తండా 2. గుడివెనుక తండా, 3. చెన్నాపూర్, 4. నేరల్ తండా, 5. సోమారంతండా, 6. గొల్లాడితండా, 7. తిప్పారం తండా, 8. పర్మల్ల తండా, 9. దుర్గం, 10. లొంకతండా, 11. పిస్కిల్గుట్ట తండా, 12. కాయితీ తండా,13. రాంపూర్ గడ్డ తండా, 14. మాతుసంగెం, 15. మేడివల్లి,16. సోమ్లానాయక్ తండా.

లింగంపేట మండలంలో..

1. అయ్యపల్లి తండా, 2. బాణాపూర్, 3. లింగంపల్లి కుర్దు, 4. మాలోత్ సంగ్యానాయక్ తండా, 5. మాలోత్ తండా, 6. మెంగారం, 7. ముంబోజీపేట తండా, 8. నల్లమడుగు పెద్దతండా, 9. ఒంటరిపల్లి, 10. రాంపల్లి 11. రాంపల్లి స్కూల్ తండా, 12. సజ్జన్పల్లి, 13. ఎల్లారం, 14. బాణాపూర్ తండా

నాగిరెడ్డిపేట మండలంలో

1. వెంకంపల్లి, 2. అక్కంపల్లి,3. మాసాన్పల్లి, 4. అచ్చాయపల్లి5. పల్లెబొగుడతండా, 6. నాగిరెడ్డిపేట, 6 మాసాన్పల్లి

రాజంపేట మండలంలో

1. గుడితండా 2. శరశంకర్ తండా సదాశివనగర్ మండలంలో&1. తుక్కోజి వాడి, 2 సజ్జ నాయక్ తాండ, 3 తిర్మన్ పల్లి

గ్రామాల్లో ఏకగ్రీవం ఆశలు. . ప్రోత్సాహక నిధులతో అభివృద్ధికి బాటలు

స్థానిక ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీలు కూడా దృష్టి పెట్టడంతో పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో పదవులు కైవసం చేసుకోవాలని ఆశతో ఉంటే గ్రామాల్లో ప్రభుత్వం ప్రోత్సాహపు మాటలతో మరోసారి ఏకగ్రీవ పంచాయతీల చర్చకు దారితీసింది. గత ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవ ఆశలు ముందుకు తీసుకొచ్చింది. పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా పల్లెలు సజావుగా అభివృద్ధి చెందుతాయని, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ. 10 లక్షలు ప్రోత్సాహం ఇస్తుందని వెల్లడించారు.

యితే గత ప్రభుత్వ హయాంలో 2019 ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు రూ 10 లక్షలు ప్రోత్సాహం ఇస్తామని మంత్రులు ప్రకటించారు. పదవీ కాలం ముగిసినా రూ 10 లక్షల ప్రోత్సాహం మాత్రం రాలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఏకగ్రీవ పంచాయితీలకు ప్రోత్సాహక నిధులు వస్తాయో లేదో వేచి చూడాల్సి ఉంది.

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పిలుపుతో ఏకగ్రీవాల జోరు

పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుమారుగా 45 పంచాయతీల్లో ఏకగ్రీవాలు అయినట్లు సమాచారం. పల్లెల అభివృద్ధికి ఏకతాటితో ముందుకు రావాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇచ్చిన పిలుపు మేరకు గతంలో ఎన్నడు లేని విధంగా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 45 చోట్ల ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది.

అయితే ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందజేసే నజరానాతో గ్రామాలకు నిధులు వచ్చే అవకాశం ఉందని, ఈ నిధులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగించే అవకాశం ఉందన్న ఎమ్మెల్యే పిలుపు మేరకు సుమారు 45 గ్రామపంచాయతీలలో ఏకగ్రీవాలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో 45 చోట్ల ఏకగ్రీవాలు కావడం ఇటు కామారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే మదన్మోహన్రావు మార్కు రాజకీయం కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.