07-12-2025 02:46:54 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ స్టేడియంలోని ఈనెల 13వ తారీకు జరగనున్న తెలంగాణ రేసింగ్ ఉత్సవాల్లో మెస్సి టీం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో కలసి ఉప్పల్ స్టేడియం ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్ లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మెస్సి కూడా తెలంగాణ రైసింగ్ చాలా బావుంది దాంట్లో నేను కూడా పాలుపంచుకోవాలని ఉద్దేశంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ కార్యక్రమంలో మెస్సిపాల్గొనున్నట్ల తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఒక టీం మెస్సి టీంతో ఆడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెస్సి ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడని ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది కాబట్టి మన రాష్ట్రాల్లో కూడా ఇక్కడికి వచ్చిన మెస్సికి సెక్యూరిటీని కల్పిస్తున్నామని తిరిగి వెళ్లే వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రజలు సమయం కన్నా ముందే రావాలని అలా రావడం వల్ల తొక్కిసేలాటలు జరగకుండా ఉంటుందని మంత్రి భటి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.