2 March, 2026 | 6:17 AM

భవాని పేటలో ముగిసిన ఎల్లమ్మ ఉత్సవాలు

02-03-2026 01:07 AM

మారు నైవేద్యం సమర్పించిన ఆలయ కమిటీ, గీత పారిశ్రామిక సంఘం ప్రతినిధులు 

కామారెడ్డి, మార్చి 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం  భవానిపేటలో ఆదివారం ఎల్లమ్మ అమ్మవారికి మారు నైవేద్యాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు, గీత పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు పాల్గొని సమర్పించారు. కళాకారులు ఎల్లమ్మ ఆలయం ముందు పట్నం వేసి మారు నైవేద్యం ఒగ్గు కథ తో ఎల్లమ్మకు సమర్పించారు. గత వారం రోజులుగా ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

గౌడ కులస్తులు ఇంటికొక బోనాన్ని ఎల్లమ్మకు ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రేణుక మాత ఎల్లమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు అధ్యక్షులు, అక్కల మల్ల గౌడ్, ఉపాధ్యక్షులు సూరన్న గారి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అక్కల శేఖర్ గౌడ్, కోశాధికారి ఆశన్న గారి బాలరాజు గౌడ్, పెద్దస్వామి గౌడ్, చిన్న స్వామి గౌడ్, మహేందర్ గౌడ్, గౌడ సంఘం, గీత పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు చంద్రం గౌడ్, కర్రోల్ల రాజా గౌడ్, నారా గౌడ్, బాలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.