23 April, 2026 | 12:37 AM

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

12-05-2024 01:10 AM

రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్, మే 11( విజయక్రాంతి) : రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావ రణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 45.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. శనివారం ఆదిలా బాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం 42.2 డిగ్రీలు నమోదు కాగా, అత్యల్పంగా వికారాబాద్ జిల్లా మర్ప ల్లిలో 20.4డిగ్రీలు నమోదైట్లు వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 39 నుంచి 42 డిగ్రీ ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా 25 నుంచి 28 డిగ్రీలు నమోదు అవుతుందని పేర్కొంది. యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నారాయణపేట, హైదరాబాద్ ప్రాం తాలకు వాతావరణ శాఖ ఎల్లో అల ర్ట్ జారీ చేసింది.