12 July, 2026 | 10:02 PM

రూ. 1,440 కోట్ల యెస్ బ్యాంక్ షేర్లు విక్రయం

04-05-2024 12:10 AM

యూఎస్ ఫండ్  కార్లేలే లావాదేవీ

ముంబై, మే 3: యూఎస్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కార్లేలే గ్రూప్ శుక్రవారం యెస్ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున వాటాను విక్రయించింది. యెస్ బ్యాంక్ ఈక్విటీలో 2 శాతానికి సమానమైన 59.40 కోట్ల షేర్లను బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించినట్టు ఎన్‌ఎస్‌ఈ సమాచారం వెల్లడిస్తున్నది. షేరు సగటు ధర రూ.24,27 వద్ద జరిగిన ఈ లావాదేవీ విలువ రూ.1,441.63 కోట్లు. సింగపూర్‌కు చెందిన శాక్స్ పీటీఈ రూ.895.78 కోట్ల పెట్టుబడితో 36.92 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్టు సమాచారం. తాజా బ్లాక్ డీల్‌కు ముందు కార్లేలే గ్రూప్‌నకు యెస్ బ్యాంక్‌లో 8.74 శాతం వాటా ఉన్నది. శుక్రవారం యెస్ బ్యాంక్ షేరు ధర 1.95 శాతం క్షీణించి రూ.24.95 వద్ద ముగిసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికరలాభం 123 శాతం వృద్ధితో రూ.452 కోట్లకు చేరింది. బ్యాంక్ వడ్డీ ఆదాయం 20 శాతం ఎగిసి రూ.7,447 కోట్లకు పెరిగింది.