17-02-2026 01:04:50 AM
కార్పొరేషన్‌తో కలిసి వచ్చిన అదృష్టం
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మండల పరిధిలో ఎంపీటీసీగా సేవలందించిన గణేష్ కు, నూతనంగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. సుజాతనగర్ కు చెందిన 20 డివిజన్ నుంచి మున్సిపల్ కార్పొరేటర్ గా ఎన్నికైన అతనికి మేయర్ పదవి దక్కడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం కార్పొరేషన్’కు తొలిసారి జరిగిన ఎన్నికల్లో సిపిఐ ఘనవిజయం సాధించింది.
కార్పొరేషన్’లోని 60 స్థానాల్లో సిపిఐ ఒంటరిగా పోటీ చేసి 23 స్థానాల్లో విజయం సాధించింది. 22 స్థానాల్లో సిపిఐ అభ్యర్థులు విజయం సాధించగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు తెలిపి ప్రచారం చేయడం ద్వారా స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్’తో ఒప్పందం కుదుర్చుకొని మేయర్ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకొని కమ్యూనిస్టు పార్టీ సత్తా చాటింది.
మేయర్ : మూడ్ గణేష్
డివిజన్ : 20వ డివిజన్ (సుజాతనగర్ టౌన్)
తండ్రి : రాములు
భార్య : మూడ్ సింధు
కుమారుడు : సాత్విక్
విద్యార్హత : ఐటిఐ (ఎలెక్ట్రిసియాన్)
గత పదవి : తాజామాజీ ఎంపిటిసి (2019లో ఎన్నిక). పార్టీ : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)
పార్టీలో పదవి : సిపిఐ సుజాతనగర్ మండల కార్యవర్గ సభ్యులు స్వగ్రామం కోమటిపల్లి కొత్తగూడెం కార్పొరేషన్లో కలవడంతో కార్పొరేటర్ గా పోటీ చేశాడు.
చిరునామా : కోమటిపల్లి గ్రామం, సుజాతనగర్ మండల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.