11 April, 2026 | 2:10 AM

యోగా రోజూ సాధన చేయాలి

11-04-2026 12:00 AM

యోగాసనాలు, ధ్యానంతో ఎన్నో ఉపయోగాలు

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 10(విజయక్రాంతి): రోజూ యోగా సాధన చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల సం దర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయు ష్ విభాగం ఇతర శాఖల సంయుక్త భాగస్వామ్యంతో యోగాపై అవగాహన కార్యక్రమా న్ని శుక్రవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించా రు. అనంతరం యోగా గురువు యోగాసనాలు వేయించి, ధ్యానం చేయించారు ధ్యానం, యోగాసనాలతో కలిగే లాభాలను వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు ఇందులో భాగంగా జూన్ 12 వ తేదీ వరకు వివిధ శాఖల జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తు న్నామని తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ వారోత్సవాల సందర్భంగా రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపడుతున్నామని వెల్లడించారు. మన దేశంలో పతంజలి యోగాను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ రోజూ అరగంట నుంచి గంట సమయం పాటు వ్యాయా మం, యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యాని కి ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు.

దీంతో రోజు వారి పనితీరు,వృత్తి నిర్వహణకు ఉపయోగపడుతుందని తెలిపారు. యోగా జీవితంలో భాగం చేసుకోవా లని పేర్కొన్నారు. ఎన్నో శారీరక రుగ్మతలు యోగాసనాలు, ధ్యానం సాధనతో దూరమవు తాయని చెప్పారు. యోగా అంటే జీవన విధానమని పేర్కొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇతర అన్ని వివరాలతో ఆన్లైన్లో కూడా ఎన్నో వీడియోలు, గురువుల ద్వారా నేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు.

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ కేంద్రాల్లో వీటిపై అవగాహన, శిక్షణ అందిస్తారని వెల్లడించారు. వైద్యులు చికిత్స, మందులతో పాటుగా యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామంతో ఎన్నో ఉపయోగాలు అని ఉ న్నాయని చెబుతున్నారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.అనంతరం ఆయుష్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ము ఖ్య అతిథులను సన్మానించారు. సిరిసిల్ల మా ర్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వ్య వసాయ అధికారి అఫ్జల్ బేగం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.