సభలో కాకా పెద్దకొడుక్కి అవమానం..?
- ఎమ్మెల్యే పై సీఎం అసంతృప్తి..
- ఆసిఫాబాద్ సభలో ఎమ్మెల్యేకు అవమానం
- సీఎం నోట పలుకని వినోద్ పేరు
- జిల్లా అంతటా ఇదే చర్చ
- సభ మధ్యలోనే అలిగొచ్చిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి, జూన్ 4: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై అధిష్టానంలో అసంతృప్తి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. ఇటీవల ఆసిఫాబాద్ సీఎం సభలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు నిండు సభలో అవమానం జరిగింది. అది అవమానమా.. అనుకోకుండా జరిగిన తప్పిదమా అర్థంకాని అంతుచిక్కని అంశం. కాగా ఇంతకీ ఎమ్మెల్యేకు ఏమి జరిగింది... సీఎం రేవంత్ రెడ్డి వేదికపై కూర్చున్నారు.
సభలో మాట్లాడే ముందు. వేదికపై ఉన్న అందరినీ పేరు పేరునా సీఎం తన ప్రసంగానికి ముందూ మర్యాదపూర్వకంగా ఉచ్చరిం చారు. ఇంతవరకు బాగానే ఉంది. వేదికపైనా ఉన్న ప్రతీ ఒక్కరి పేరు ను సీఎం పల కరించారు. ఆ సభలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేరును మాత్రం సీఎం పలుకడం మరిచిపోయారు. ఇదే ప్రధాన అంశంపై రెండు జిల్లాలో వాడివేడిగాచర్చ జరుగుతోంది. సీఎం, ఎమ్మెల్యే పేరు ను అలవోకగా పలుకలేదా? ఉద్దేశ పూర్వకంగానే మరిచిపోయారా? అనేది ఇక్కడ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
ఏదేమైనా ఆసిఫాబాద్ సభలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మాత్రం అవమానమే జరిగింది. ఇది ఎవరూ కాదనలేనిది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. వినోద్ పేరును సీఎం పలుకపోవడంతో ఆయన సభలో తీవ్ర అవమానంగా ఫీలయ్యారు.
ఈ ఉదంతం అక్కడి వారిని ఆద్యంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరాభావాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి ఎమ్మెల్యే వినోద్ తన వెంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య లీడర్లను వదిలేసి ఒంటరిగా బెల్లంపల్లికి వచ్చారు. సభలో జరిగిన అవమానం ఆయనను ఎంతగా బాధపెట్టిందో అర్థమవుతుంది.
ప్రాధాన్యత తగ్గుతుందా..?
ఆసిఫాబాద్ సీఎం సభలో ఎమ్మెల్యేకు జరిగిన అవమానం పై అనేక అంశాలు చర్చకెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి కి కాకా వెంకటస్వామి తనయులు వినోద్, వివేక్ అత్యంత సన్నిహితులుగా పేరుంది. కాంగ్రెస్ లో కాకా కుటుంబానికి ఎనలేని ఖ్యాతి ఉంది. తొలితరం రాజకీయ కురువృద్ధుడు కాకా వెంకటస్వామి. కాగా ఆయన తనయులుగా గడ్డం బ్రదర్స్ కు ప్రభుత్వ పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ సీఎం సభలో మంత్రి గడ్డం వివేక్ పేరును పిలిచి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేరును సీఎం ఎలా మరిచిపోతారనేది ఇక్కడ అంతుచిక్కడం ఫోన్లేదు. గడ్డం బ్రదర్స్ లో ఒకరి పేరు పలికి మరొకరి పేరును మర్చిపోవడంటూ ఉండదని విశ్లేషకులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేరును పలికరించకపోవడం పైకి మరిచిపోయినట్టు కనిపించినా అందులో బలమైన మతలబు ఉంటదని పరిశీలకులు భావిస్తున్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ఇక్కడ బయటపడిందని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోన్నది. ఆసిఫాబాద్ సభలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పట్ల అసహనం సీఎం చెప్పకనే చెప్పినట్టు నిండుసభలో వెల్లడించారనీ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఘటననూ ఎమ్మెల్యే కు వ్యతిరేక సంకేతాలుగా నీ అందరూ భావిస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు, ఆయన అనుచర వర్గం ప్రధానంగా పీ ఏ ల వివాదాస్పద వ్యవహారశైలి కాంగ్రెస్ అధిష్టానికి చేరకుండా ఉండదూ.
అంతేకాకుండా ఎమ్మెల్యే గా రెండున్నరేళ్ళు గడిచిపోయినా ఆయన పనితీరులో కాసింత ప్రోగ్రెస్ మచ్చుకు కనిపించడంలేదన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. ఇలాంటి ప్రధాన అంశాలే సీఎం అసంతృప్తి కి కారణాలైంటవని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆసిఫాబాద్ సభలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు జరిగినా అవమానం వెనుక సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును అంత ఈజీ గా కొట్టిపారేయలెం. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అవమానం కోణంలో చూడకుండా తన పనితీరు ను లోతుగా సమీక్షించాలని పరిశీలకులు సూచన చేస్తున్నారు. అశేష ప్రజానీకం సమక్షంలో జరిగిన అవమానంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎలా వ్యవహరిస్తారో? ఎలాంటి గుణపాఠం తీసుకుంటారో చూడాలి మరి.






