మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి అడ్లూరి
కోరుట్ల ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం శుక్రవారం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి మార్క్ పెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనుగోలు కేంద్రాన్ని సంక్షే మ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అందులో భాగంగానే కోరుట్ల మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కావున రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించుకొని2400 మద్దతు ధర పొందాలని, కొనుగోలు చేసిన 48 గంటల లోనే డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. సూచించారు.
రైతుల పక్షపతి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం అనునిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకొని మద్దతు ధర పొందాలని దళారుల ను అమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్నం అనిల్, కలెక్టర్ సత్య ప్రసాద్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.




