ఉద్యమకారుల ఆశయ సాధనకే టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి
గజ్వేల్‌లో జెండా ఆవిష్కరణ
గజ్వేల్, జూన్ 4: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద టీ ఆర్‌ఎస్ పార్టీ జెండాను రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తె లంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా టీఆర్‌ఎస్ పా ర్టీ ముందుకు వస్తోందన్నారు. తెలంగాణ ప్ర జల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో కల్వకుం ట్ల కవిత నాయకత్వంలో పార్టీ పనిచేస్తోందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఉచిత వైద్యం, నా ణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశా ల కల్పన పార్టీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే తమ రాజకీయ ఎజెండా అని స్పష్టం చేసిన యాదగిరి, ప్రజల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






