9 April, 2026 | 2:16 AM

ఆరోగ్య సంరక్షణలో యోగా కీలకం

09-04-2026 12:13 AM

బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా గురువారం బోడుప్పల్, లక్ష్మీ నగర్ కాలనీ పార్క్ యందు యోగా క్యాంప్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోడుప్పల్ సర్కిల్(10) డిప్యూటీ కమిషనర్ శైలజ పాల్గొని ఆరోగ్య సంరక్షణలో యోగా కీలకం అని, ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఎన్ సి డి  డిసీజెస్ రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ హెచ్ డా క్టర్  చైతన్యకుమార్, ఏ ఈ  మహేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.