4 July, 2026 | 9:56 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కారు అదుపుతప్పి వ్యక్తి మృతి

21-06-2025 11:46 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి చెట్టును ఢీకొనగా వ్యక్తి మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం(Raipole Mandal) మంతూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన కుంట దుర్గాప్రసాద్(36) గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తమ్ముని కూతురు ఫంక్షన్ కి రాయపోల్ వచ్చాడు.

శనివారం ఉదయం సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తానని రాయపోల్ నుంచి బయలుదేరాడు. సిద్దిపేట వెళ్లే క్రమంలో మార్గమధ్యలో మంతూర్ గ్రామ సమీపంలో అజాగ్రత్తగా అతివేగంతో వెళ్లి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి గమనిస్తే దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.