పిడుగుపాటుకు గురై కాడెద్దులు మృతి
30-05-2026 12:00 AM
గట్టు, మే 29 : గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడి వర్షానికి పిడుగుపాటు సంభవించడంతో రెండు కాదెద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు బంట్రోతు కుశలన్న కు చెందిన ఎద్దులను సమీపాలోని దొడ్డిలో కట్టేసాడు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. దీంతో రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించాలని బాధిత రైతు కోరుతున్నాడు.






