స్వర్గం లోతు చూపించావే పూల కడలి..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’. ‘90’ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలైలో థియేటర్లలో అడుగుపెట్టనుంది.
ఈ చిత్రబృందం తాజాగా రెండో గీతం ‘ప్రియసఖి’ని విడుదల చేసింది. ‘సూర్యుడు చూడని కొత్త కాంతి ఇది.. చంద్రుడు ఎరుగని కొత్త వెన్నెలిది.. భూమికి తెలియని మట్టి వాసనిది.. ఏమిదీ... జీవితాన్నే మార్చేశావే బుజ్జి నెమలీ.. స్వర్గం లోతు చూపించావే పూల కడలి..’ అంటూ సాగుతున్న ఈ పాట సాహిత్యాభిమానులను, సంగీత ప్రియులను వెంటాడేలా ఉంది.
సురేశ్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపర్చగా, కేఎస్ హరిశంకర్ ఆలపించారు. పాటలో నాయకానాయికలు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; డీవోపీ: అజీమ్ మహమ్మద్; ఎడిటింగ్: నవీన్ నూలి.






