దగాకోరు మాటలు మానుకోవాలి
మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫైర్
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): దగాకోరు మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఫిషరీష్ చైర్మ న్ మెట్టు సాయి కు మార్ హితవు పలికారు. బీఆర్‌ఎస్ అంటే బట్టేబాజ్ రాష్ట్ర సమితి అని, మతి లేని, సుతి లేని మాజీ మంత్రి హరీశ్‌రావు.. ఫ్యూచర్ సి టీని రద్దు చేస్తామనడం తగదన్నారు. హరీశ్‌రావు దగాకోరు మాటలు మానుకోవాలని సూచించారు. ఫ్యూచర్ సిటీని ఆపే దమ్ము, సత్తా హరీశ్‌రావుకు, కేటీఆర్‌కు లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు.
హరీశ్‌రావు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయేది ఖాయమని, బీఆర్‌ఎస్ భూస్థాపితం అవుతుందని జోస్యం చె ప్పారు. ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ యు వత భవిషత్తు అని చెప్పారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకుని తెలంగాణ యువత భవిషత్తుకు అడ్డుపడాలని హరీశ్‌రావు చూస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అమరవీరుల కుటుంబాల, నిరుద్యోగుల ఆ శీర్వాదం ఉన్నదని, ఆయనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.






