ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలి
-బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఓటు హక్కు కలిసిన ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరుందో లేదో చూసుకోవాలని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి కోరారు. వెంకటేశ్వర కాలనీ డివిజన్ శ్రీనికేతన్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఎల్‌ఓ షేక్ అక్రమ్, బీఎల్‌ఏ సుధీర్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియను పరిశీలించారు.
సిబ్బందికి ఓటరు నమోదు, మరణించి వారి పేర్ల తొలగింపు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరా లను సరిచేయడం వంటి అంశాలపై సూచనలను చేశారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన గొప్ప అవకాశమన్నారు. అర్హులైన వారు నూతనంగా ఓటరు నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. అధికారులు, సిబ్బంది పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, ప్రేమ్‌వెంకట కోటిరెడ్డి, దామోదర్ నాయుడు, కాలనీవాసులు పాల్గొన్నారు.






