27 June, 2026 | 1:32 AM

వీహెచ్‌కు అస్వస్థత

27-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న ఆయన ఖైరతాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. గతంలో వీహెచ్ యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు.