calender_icon.png 26 January, 2026 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీయిజం చేసే నువ్వా నా గురించి మాట్లాడేది

26-01-2026 09:52:16 PM

* నయీమ్ ను అడ్డం పెట్టుకొని బ్రతికింది నీవు 

* సేవ చేసే కుటుంబంలో మేమున్న దోపిడిలో నువ్వు ఉన్నావు 

* అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ 

అచ్చంపేట: ప్రజాసేవలో మమేకమైన తమను ప్రజల్లో దృష్టి మరల్చిందికే బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రయత్నిస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్పష్టం చేశారు. డబ్బులు పెట్టి డాక్టరేట్ సంపాదించిన మాజీ ఎమ్మెల్యే పేదలకు వైద్యునిగా సేవలందించిన తనను విమర్శించడం ఆయన విజ్ఞతకే చెల్లిందని అభిప్రాయపడ్డారు. సోమవారం అచ్చంపేటలో డాక్టర్ వంశీకృష్ణ స్థానిక విలేకరులతో మాట్లాడారు. నయీమ్ అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే తన విమర్శించడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.

అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఓటమిని తట్టుకోలేక తన పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రూ.100 కోట్లకు అమ్ముడుపోయిన వ్యక్తి తన విమర్శించడం.. నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బాలరాజు అచ్చంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లడని ధ్వజమెత్తారు. నక్సలైట్లతో తనకు సంబంధాలు ఉన్నాయని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే వాటిను నిరూపించాలని సవాల్ విసిరారు.

దాని నిరూపిస్తే రాజకీయంగా వైదొలుగుతాని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ  రామనాథం, ఓబీసీ సెల్ గిరి వర్ధన్ గౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శారదమ్మ, రాజగోపాల్, మహబూబ్ అలీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు