26-01-2026 09:55:42 PM
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.డి అయుబ్, లతో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ కన్నా కలలను నిజం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందించాలన్నారు. సమాజంలో నిరక్షరాస్యత, అంటరానితనాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శిలు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి అజీజ్ ఖాన్, మున్సిపల్ ఫోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు బొమ్మతి విక్రమ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పెరుమండ్ల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, కాంగ్రెస్ శ్రేణులు హనుమకొండ అంబేద్కర్ రాజ్, పోలేపల్లి బుచ్చిరెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.