15 April, 2026 | 5:49 PM

పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య

25-11-2025 12:00 AM

తలమడుగు, నవంబర్ 24 (విజయక్రాంతి):అధిక వర్షాలతో పంట దిగుబడి రాక, చేసిన అప్పులు ఎలా తీర్చాలని బెంగ తో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎస్త్స్ర రాధికా తెలిపారు  వివరాల ప్రకారం... మండలంలోని  డోర్లీ  గ్రామానికి చెందిన లింగన్న తన తండ్రి పేరు మీద గల మూడు ఎకరాల 30 గుంటల భూమిలో కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

వ్యవసా యానికి తీసుకొచ్చిన అప్పు దాదాపు మూడు లక్షల వరకు ఉంటుందన్నారు. వ్యవసాయ పొలంలో పత్తి పంట వేయగా భారీ వర్షాలకు పంట నష్టం జరిగిందనే మనస్తాపంతో ఈనెల 23  రాత్రి సమయంలో లింగన్న (23) పురుగుల మందు తాగా స్పృహ తప్పి పడిపొగ కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లరు. చికిత్స పొందుతూ సోమవారం మరణించగా మృతుడి తల్లి  జలారపు విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.