calender_icon.png 24 November, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమ భద్రతపై కలెక్టర్ సమీక్ష

24-11-2025 10:30:25 PM

అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో భార జల కర్మాగారం ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీపై సోమవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పటేల్ కీలక సూచనలు చేశారు. కర్మాగారంలో సంభవించే విషవాయువు లీకేజీ వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహించడం యాజమాన్యం తీసుకున్న మంచి చర్య అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్మాగారం పరిసర గ్రామాల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో జరగబోయే ప్రమాదాలు, వాటి నివారణ మార్గాలపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ జోన్ పరిధిలోని గ్రామాల్లో మంచినీరు, రహదారి నిర్మాణం, విద్యా సదుపాయాలు, సేఫ్టీ షెల్టర్లు వంటి అత్యవసర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల భద్రతా చర్యలపై సూచనలు అందించారు.