calender_icon.png 24 November, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి: యుటిఎఫ్

24-11-2025 10:27:13 PM

అన్నపురెడ్డిపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులు శాతం తగ్గిపోతుందని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతబడతున్నాయని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్య ఏవిధంగా వుంది అని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2010 సంవత్సరం కంటే ముందు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన వారందరినీ మళ్ళీ టెట్ రాయాలి అనడం దురదృష్టకరం అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులను ఎవరస్ట్ శిఖారలు ఎక్కించిన ఘనత అప్పటి ఉపాధ్యాయులుదే అని అంతేకాకుండా ఎంతో మంది డాక్టర్లను, శాస్త్రవేత్తలను సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే నాణ్యమైన విద్యను అందించి గొప్ప గొప్ప వారిని దేశానికి అందించారు.

కానీ ఇన్నీ సంవత్సరాలు అనుభవం వున్న వారిని ఇప్పుడు టెట్ రాయాలి అని అనడం సరైన పద్ధతి కాదని, వెంటనే 2010 సంవత్సరం కంటే ముందు ఉపాధ్యాయ అర్హత సాధించిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వ్వల్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు వున్నాయి అని ఎంతో మంది పదవి విరమణ చేసి వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇంత వరకు రాలేదు అని అన్నారు. జీవో 317 వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ప్రవేటు పాఠశాలల్లో కనిష అర్హత లేని వారితో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ లక్షలు రూపాయలు వసూళ్లు చేస్తున్నారని అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం, అర్హతతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె.గంగాధర్ రావు,మండల కార్యదర్శి బి.వీరు మండల ఉపాధ్యక్షులు రమాదేవి సభ్యులు విజయకుమారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.