5 August, 2026 | 9:45 PM

కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు

05-08-2026 09:03 PM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

టేకుమట్ల కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

భూపాలపల్లి/టేకుమట్ల,(విజయక్రాంతి): కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. టేకుమట్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. పాఠశాల హాస్టల్ వసతులు, పరిశుభ్రత, భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు వసతులు, భోజనం సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. చదువుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. తల్లిదండ్రుల కోసం వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల అభ్యర్థనపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.